24 కిస్సెస్ మూవీ టీజర్

హెబ్బా పటేల్, ఆదిత్ జంటగా నటించిన చిత్రం 24 కిస్సెస్. మిణుగురులు సినిమా ఫేమ్ ఆయోధ్యకుమార్ కృష్ణమ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పేరుకు తగినట్లుగానే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది.రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోన్నఈ చిత్రం జూలై 6న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నటి ఇలియానా ఆవిష్కరించారు.

ఇది వరకే షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ”నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం” ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో యువతను అలరించబోతోందని నిర్మాతలు తెలిపారు. టీజర్‌ ఇలియానా చేతుల మీదుగా విడుదలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, టీజర్ చూసిన తర్వాత ఎంతో ఇంప్రెస్ అయిన ఆమె, సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్రయూనిట్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పినట్లుగా దర్శకుడు అయోధ్యకుమార్ తెలిపారు. ఈ టీజర్‌ లో ఓ జంట తమ రూమ్ కి వెళ్లే క్రమంలో వారి మధ్య జరిగిన సున్నితమైన రొమాన్స్ ను చాలా బాగా చూపించారు. హెబ్బా పటేల్ చాలా రోజుల తరువాత ఇలాంటి రోల్ చేయడంతో చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో అదితి మ్యాక, రావు రమేష్‌, నరేష్‌ ముఖ్యపాత్రలు కనిపించానున్నారు..