
Abhishek Bachchan earnings:
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కుమారుడిగా Abhishek Bachchan నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే కోటీశ్వరుడైన అభిషేక్ బచ్చన్ ప్రతినెల ఎస్బిఐ బ్యాంక్ నుంచి 18 లక్షల రూపాయలు అందుకుంటున్నారు అన్న విషయం మీకు తెలుసా?
జూహులోని “అమ్ము అండ్ వాత్స్” అనే వారి లగ్జరీ బంగ్లా గ్రౌండ్ ఫ్లోర్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాల పాటు లీజ్ కి ఇచ్చారు అభిషేక్. ఈ ఒప్పందం ద్వారా అభిషేక్ ప్రతినెల రూ. 18.9 లక్షల అద్దెను పొందుతున్నారు. ఇది 5 సంవత్సరాల తర్వాత రూ. 23.6 లక్షలకు, 10 సంవత్సరాల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరగనుంది.
ఈ వివరాలను తాజాగా బయటకి రాగా, ఫాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబం బాలీవుడ్‌లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇంత పెద్ద డీల్ ఎలా సాధ్యం? అంటే, ఇది వార స్థిరాస్థి మేనేజ్‌మెంట్ కి నిదర్శనం అనచ్చు. లాంగ్‌టర్మ్ ప్రాఫిట్‌ను ఎలా సాధిస్తున్నారో బచ్చన్ కుటుంబం నుండి నేర్చుకోవాలి.
ఇక అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్ బచ్చన్, బాలీవుడ్‌లో అత్యంత అందమైన హీరోయిన్లలో ఒకరు. వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా తాజాగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.