HomeTelugu Trendingరామమందిర నిర్మాణానికి అక్షయ్‌ కుమార్‌ విరాళం

రామమందిర నిర్మాణానికి అక్షయ్‌ కుమార్‌ విరాళం

Akshay gives fund for ayodh
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సెలెబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి సహకారం అందించాలని అభిమానులు, అనుచరులను కోరుతూ నటుడు అక్షయ్ కుమార్ ఒక వీడియోను పంచుకున్నారు. తన వంతు కర్తవ్యంగా కొత్త మొత్తాన్ని అందించినట్లు వీడియోలో పేర్కొన్నాడు. దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి విరాళాలివ్వాలని ఆయ‌న కోరాడు. అయోధ్య రాముడి ఆల‌య‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలిపాడు. చివ‌ర‌కు ‘జై శ్రీరాం’ అని నినదించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!