HomeTelugu TrendingAkshay Kumar 100 కోట్ల సినిమాకి ఇన్ని కష్టాలా? షూటింగ్ ఆపేశారా?

Akshay Kumar 100 కోట్ల సినిమాకి ఇన్ని కష్టాలా? షూటింగ్ ఆపేశారా?

Akshay Kumar’s ₹100 Cr Film in Trouble: Shooting Halted!
Akshay Kumar’s ₹100 Cr Film in Trouble: Shooting Halted!

Akshay Kumar Upcoming Movies:

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి హిట్ కొట్టాడు ‘హౌస్‌ఫుల్ 5’తో. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ. 244 కోట్లు కలెక్ట్ చేసి ఘన విజయం సాధించింది. దీంతో ‘ఖిలాడీ’ అక్షయ్ ఫాంలోకి వచ్చేశాడనుకుంటే.. మరోవైపు మాత్రం ఆయన కొత్త సినిమా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.

వెల్కమ్ సిరీస్‌లో మూడో భాగమైన ‘Welcome To The Jungle’ సినిమా భారీ స్టార్ క్యాస్ట్‌తో డిసెంబర్ 2023లో షూటింగ్ మొదలైంది. అయితే చివరి రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 2023లో జరిగిందని సమాచారం. అప్పటి నుంచి షూటింగ్ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దానికి ప్రధాన కారణం.. ఫైనాన్షియల్ ఇష్యూలు!

సినిమాలో 60% వరకు పనులు పూర్తి అయినప్పటికీ, మిగిలిన 40% షూటింగ్ ఇంకా మిగిలే ఉంది. ఈ ఆరు నెలల్లో పలుమార్లు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసినా, అవన్నీ రద్దయ్యాయి. అందుకే ఈ చిత్రంపై స్పష్టత లేకుండా పోయింది.

 

View this post on Instagram

 

A post shared by JioHotstar (@jiohotstar)

మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. షూట్ చేసిన కొన్ని నటులకు ఇప్పటివరకు పారితోషికాలు కూడా ఇవ్వలేదట. అందులో సంజయ్ దత్ వంటి నటులు ఇప్పటికే మూవీ నుంచి బయటపడిపోయారు. స్క్రిప్ట్ సమస్యలు, డేట్ ఇష్యూలు అంటూ ఆయన తప్పుకున్నారని చెబుతున్నారు.

స్పెషల్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కే 80% స్టేక్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మిగతా వాటా ఫిరోజ్ నాడియాద్‌వాలా వంటి నిర్మాతలకు ఉంది. అయినా ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేశ్ రావల్, రవీనా టాండన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా 2024 క్రిస్మస్ విడుదలకు ప్లాన్ చేశారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆ డేట్ సాధ్యపడేలా లేదు.

ALSO READ: Maha Kumbh Girl Monalisa లగ్జరీ కార్ లో.. ధర ఎంతంటే..

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!