HomeTelugu Trendingకంటెస్టెంట్‌పై మండిపడ్డ అమితాబ్‌

కంటెస్టెంట్‌పై మండిపడ్డ అమితాబ్‌

Amitabh Bachchan fire on co
బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌ కంటెస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ షోలో మధ్యప్రదేశ్‌కు చెందిన కోష్లేంద్ర సింగ్‌ తోమర్‌ కంటెస్టెంట్‌గా వచ్చాడు. 40 వేల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే షోలో గెలుచుకున్న డబ్బును మీ గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తారా అని బిగ్‌బీ అడిగాడు. దీనికి అతడు తన భార్య ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయిస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో బిగ్‌బీ ఆశ్చర్యానికి గురై.. వెంటనే ప్లాస్టిక్‌ సర్జరీ ఎందుకోసం అని ప్రవ్నించారు.

దీంతో కోష్లేంద్ర.. 15 ఏళ్లుగా తన భార్య మొహం చూసి విసిగిపోయానని చమత్కరించాడు. దీంతో అతడిపై బిగ్‌బీ మండిపడుతూ ఇలాంటి విషయాలు సరదాకి కూడా చమత్కరించ వద్దని క్లాస్‌ తీసుకున్నారు. అయితే చాలామంది తమ అందాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్లాస్టిక్‌ సర్జరీని ఎంచుకుంటారని, కానీ అది రెండు, మూడేళ్లు మాత్రమే పని చేస్తుందన్నారు. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారన్నారని వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu