HomeTelugu Trending'సీటీమార్‌'లో అప్సర స్పెషల్‌ సాంగ్‌

‘సీటీమార్‌’లో అప్సర స్పెషల్‌ సాంగ్‌

Apsara rani special song in

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వెబ్‌ ఫిల్మ్‌ ‘థ్రిల్లర్‌’తో పాపులారిటీ మంచి క్రేజ్‌ తెచుకుంది అప్సరా రాణి. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్‌’ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ఈ పాట మంచి హిట్‌ అయింది. తాజాగా మరో బ్యూటీకి మరో ఛాన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్‌’ సినిమాలో అప్సరా రాణి స్పెషల్‌ సాంగ్‌ చేసే అవకాశం వచ్చిందట. సంపత్‌ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ‘‘మా సీటీమార్‌లో ఓ స్పెషల్‌ పటాకా సాంగ్‌లో చేస్తున్నారు అప్సర. ఈ పాట బొంభాట్‌గా ఉంటుంది’’ అని ట్వీట్‌ చేశారు సంపత్‌ నంది. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu