HomeTelugu Trendingబాలయ్యను ఢీకొట్టనున్న బాలీవుడ్‌ హీరో!

బాలయ్యను ఢీకొట్టనున్న బాలీవుడ్‌ హీరో!

balakrishna villain sanjay

నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్‌లో 3వ సినిమా తెరకెక్కుతోంది. ‘BB3’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకొటి అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్‌గా బోయపాటి.. ఒక బాలీవుడ్‌ హీరోను ఎంపిక చేసినట్లు తెలిసింది. బాలయ్య సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ హీరో సంజయ్ దత్‌ను అనుకుంటున్నారు. గతంలో ఈ సినిమా చేయడానికి నో చెప్పినా సంజూ బాబా‌.. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు బోయపాటి సన్నీహితులతో చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం సంజయ్ దత్.. యశ్ హీరోగా నటిస్తోన్న ‘కేజీఎఫ్ 2’‌లో విలన్‌గా నటిస్తున్నాడు. మున్నాభాయ్‌ ఇప్పటి వరకు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘అగ్నిపథ్’ సినిమాతో పాటు ‘పానిపట్’ సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. మొదటి సారి తెలుగులో బాలయ్య సినిమాతో విలన్‌గా కనిపించబోతున్నాడు. కరోనా కారణంగా వాయిదా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu