HomeTelugu Trendingధనుశ్‌ 'జగమే తంత్రం' టీజర్‌

ధనుశ్‌ ‘జగమే తంత్రం’ టీజర్‌

Dhanush jagame thandhiram

తమిళ స్టార్‌ హీరో ధనుశ్‌- కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘జగమే తందిరమ్‌’. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇన్నాళ్లూ విడుదల వాయిదా పడింది.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు, టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu