వచ్చే జన్మలోనైన ఆ కోరిక తీర్చుకుంటా: వరలక్ష్మి

‘పోడాపోడీ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టింది వరలక్ష్మి. ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. నాయికగా రాణించడం కాస్త కష్టంగా అనిపించడంతో ఇటీవల వరుసగా విలన్‌ పాత్రలను ఎంచుకుని.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘సర్కార్‌’, ‘సండకోళి’, ‘మారి 2’ తదితర చిత్రాల్లో కనిపించింది. తాజాగా జైకి జోడీగా ‘నీయా 2’లో నటిస్తోంది. అలాగే ‘కన్నిరాశి’, ‘వెల్వెట్‌ నగరం’, ‘రాజపార్వై’ తదితర చిత్రాల్లో నటించింది. త్వరలోనే ఆ సినిమాలు విడుదల కానున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఆమె ‘రాజపార్వై’ చిత్రంలో ఐపీఎస్‌ అధికారిగా నటిస్తోంది. దీనిపై ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘వచ్చే జన్మ అంటూ ఒకటుంటే తప్పకుండా ఐపీఎస్‌ అధికారి కావాలన్నదే నా కోరిక. నాకు ఇప్పటి వరకు భిన్నమైన పాత్రలు ఇచ్చిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటానని’ పేర్కొన్నారు. అంతేకాకుండా ఐపీఎస్‌ అధికారిగా నటించిన ఓ చిన్న వీడియోను ఆమె ఈ సందర్భంగా ఆమె పోస్ట్‌ చేశారు.