HomeTelugu Trendingరామ్‌తో ఉప్పెన బ్యూటీ!

రామ్‌తో ఉప్పెన బ్యూటీ!

Kruti shetty in ram next m
మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’. సుకుమార్‌ శిష్యూడు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్లుగా నటించింది. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించే దిశగా ఇది పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరో,హీరోయిన్‌లకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా కృతిశెట్టికి ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఊరమాస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ నిర్మాత. తాజా సమాచారం ఈ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu