
Kuberaa Day 1 Target Collections:
ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానున్న కుబేరా సినిమా ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రధాన పాత్రల్లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ మీద తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది.
తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. శేఖర్ కమ్ములకి సిగ్నేచర్ అయిన ఎమోషనల్ స్టోరీటెల్లింగ్ స్టైల్ ఇందులో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా నాగార్జున పాత్రకు గానూ ఎక్కువగా స్పందన వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత టికెట్ బుకింగ్‌లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
View this post on Instagram
బుక్ మై షోలో “కుబేరా” ట్రెండింగ్ మూవీగా మారింది. మెట్రో సిటీలలో బుకింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ధనుష్ గత రెండు సినిమాలు (రాయన్, NEEK) ఫ్లాప్ కావడం వల్ల ఈ సినిమాపై అతనికి భారీగా ఆశలు ఉన్నాయి. నాగార్జున “నా సామీ రంగ” తర్వాత మళ్లీ థియేటర్స్‌లోకి వస్తుండగా, రష్మిక దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా నిలిచింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, Day 1కి కనీసం 8-10 కోట్ల షేర్ వస్తే సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చినట్టే. మొత్తంగా 40–45 కోట్ల షేర్ వస్తే సినిమా “హిట్”గా పరిగణించబడుతుంది. సినిమాకు ఉండే సోషల్ మెసేజ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్నీ కలిపి కుబేరాను మంచి బజ్‌లో నిలిపాయి.
మూడు రోజుల్లో రిలీజ్ కావడంతో బుకింగ్స్ ఇంకా వేగం అందుకుంటున్నాయి. ఈ పేస్ కొనసాగితే, “కుబేరా” శేఖర్ కమ్ముల కెరీర్‌లో మరో హిట్ అవుతుందనడంలో సందేహం లేదు.
ALSO READ: ప్రెగ్నెంట్ హీరోయిన్ కోసం షూటింగ్ ప్లాన్ మార్చేసిన Yash