HomeTelugu Trendingమాతృదేవోభవ రీమేక్‌.. హీరోయిన్‌ ఈమేనా!

మాతృదేవోభవ రీమేక్‌.. హీరోయిన్‌ ఈమేనా!

Matrudevobhava remake
టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ లో ‘మాతృదేవోభవ’ ఒకటి. 1991 లో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. విడుదలై 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. మరోసారి ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రాన్ని.. డైరెక్టర్‌ అజయ్ కుమార్ తెరకెక్కించారు. అయితే.. రామారావు మరోసారి అజయ్ కుమార్ తోనే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిర్మాత కె.ఎస్.రామారావు దర్శకుడు అజయ్ కుమార్ ఇటీవల ‘తెరవెనుక కథలు’ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందని చెప్పారు. అయితే.. వీరు టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్నారు కాబట్టి.. పారితోషికం భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu