HomeTelugu Big Storiesమెగా బ్రదర్‌ న్యూలుక్‌ వైరల్‌

మెగా బ్రదర్‌ న్యూలుక్‌ వైరల్‌

Nagababu new look viral in

మెగా బ్రదర్‌ నాగబాబు తాజా ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. న్యూలుక్‌లో నాగబాబు ఎన్నాడు లేని విధంగా మారిపోయాడు. ఇది ఏదైనా సినిమా కోసమా లేదంటే అవకాశాల కోసమే అలా మారిపోయాడా అనేది మాత్రం తెలియదు. నాగబాబు కెరీర్‌లో చెప్పుకోదగ్గ పాత్రలు చాలానే ఉన్నాయి కానీ ఎందుకో అతనికి పెద్దగా అవకాశలు రాలేదు. అందుకే ఈయన కూడా సినిమాలు కాదని బుల్లితెరపై బిజీ అయిపోయాడు. అక్కడే ఉండిపోయాడు.. అప్పుడప్పుడూ సినిమాల వైపు వస్తున్నా కూడా కెరీర్ టర్నింగ్ ఆఫర్స్ మాత్రం రావడం లేదు. అన్నిరకాల విలక్షణ పాత్రలు చేసే సత్తా తనకు ఉంది అంటున్నాడు నాగబాబు. ఈ ఫొటోతో పాటు ట్విట్టర్‌లో పోస్ట్ కూడా పెట్టాడు నాగబాబు. బలం, బలగం, తెలివిగా ఆలోచించడమే రాజును డిసైడ్ చేయదు.. ఆటిట్యూడ్ అనేది కింగ్ ఎవరో డిసైడ్ చేస్తుంది. అందుకే సింహం అడవికి రాజు అయింది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే భుజంపై ఉన్న లయన్ టాటూ కూడా అదిరిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu