
Nani Paradise Non-theatrical business:
నేచురల్ స్టార్ నాని మరోసారి తన సినిమాతో హాట్ టాపిక్ అయ్యారు. నాని హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమా The Paradise షూటింగ్ ఇంకా ప్రారంభమవ్వలేదు కానీ, ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించి అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి రూ.65 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది తెలుగు సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్‌లో అదిరిపోయే డీల్ అని చెప్పచ్చు. అంతేకాకుండా, ప్రముఖ ఆడియో సంస్థ అయిన సారేగమా వారు ఈ సినిమా ఆడియో రైట్స్‌ను రూ.18 కోట్లకు కొనుకున్నారు. ఇలా కేవలం డిజిటల్, ఆడియో రైట్స్ ద్వారానే 83 కోట్ల రూపాయలు వచ్చేశాయి!
View this post on Instagram
ఇంకా ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ ప్రథ్యంగిరా సినిమాస్ వారు భారీ ధరకు కొనుగోలు చేశారు. అలా నిర్మాతకు షూటింగ్ మొదలవకముందే బడ్జెట్‌లో 70% రికవరీ అయిపోయింది. ఇది నిజంగా ఓ రికార్డ్.
ఇప్పుడు సినిమా ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదు అనుకుంటే… నాని మార్కెట్ కి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ డీల్‌లు చూస్తే అర్థమవుతుంది. మరి సినిమా పూర్తయి థియేటర్లలోకి వచ్చాక రిజల్ట్ ఇంకెలా ఉంటుందో చూడాలి. కాని ఇప్పటివరకు వచ్చిన హైప్ చూస్తే, The Paradise నాని కెరియర్ లో మరో సంచలన విజయాన్ని సాధించేలాగానే కనిపిస్తోంది.
ALSO READ: బాలీవుడ్ హీరోల కంటే ఈ South Indian Actors రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని తెలుసా?