HomeTelugu Trendingనితిన్‌ సినిమాలో బోల్డ్‌ పాత్రలో నయన్‌..

నితిన్‌ సినిమాలో బోల్డ్‌ పాత్రలో నయన్‌..

Nayanthara in andhadhun mov

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌ ‘అంధాధున్‌’ సినిమాను నితిన్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్ ని తీసుకున్నారట. అంధాధున్‌ సినిమాలో హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించింది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుంది. తెలుగులో ఈ కీలక పాత్రలో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా టబునే తీసుకోవాలని భావించారట మూవీ యూనిట్ కానీ కుదరలేదు. ప్రస్తుతం ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరోయిన్ నయనతార ను సంప్రదిస్తున్నారట నిర్మాతలు. నయన్ ఒప్పుకుంటే ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరుగుతాయి. మరి ఈ ఆఫర్‌ని నయన్‌ అంగీరిస్తుందో లేదో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu