HomeTelugu Big Storiesజూలై 17న సర్‌ప్రైజ్.. ఎన్టీఆర్ వీడియో రిలీజ్

జూలై 17న సర్‌ప్రైజ్.. ఎన్టీఆర్ వీడియో రిలీజ్

ntr surprise

టాలీవుడ్‌ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘RRR’. ఈ మూవీ ‘ఫస్ట్ లుక్’ ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో తమ హీరో ఎలా ఉండబోతున్నాడో చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రామ్ చరణ్ లుక్, పరిచయ వీడియో రిలీజ్‌ అయింది. ఇక ఎన్టీఆర్ వంతు మాత్రమే మిగిలిపోయింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఫస్ట్‌ లుక్‌ వస్తుందని అందరు అనుకున్నారు. కానీ.. చివరి నిమిషంలో లాక్‌డౌన్ కారణంగా స్పెషల్ వీడియోను చేయలేకపోయామని రాజమౌళి బృందం చేతులెత్తేసింది.

తాజాగా ఎన్టీఆర్‌ ఓ ప్రచార వీడియోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్’కు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్‌ను ఎన్టీఆర్ చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక యాడ్‌ను విడుదల చేసింది. జూలై 17న ఈ కంపెనీకి సంబంధించి విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని ఈ యాడ్‌లో ఎన్టీఆర్ తెలిపారు.

‘మన విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. తెలుసుకోవాలని ఉందా?’’ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇంతకీ ఆ అద్భుతం ఏంటో మరో నాలుగు రోజుల్లో తెలియనుంది. ఇది సెలెక్ట్ మొబైల్స్‌కు సంబంధించిన యాడ్ కాబట్టి ఎన్టీఆర్ సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆ అద్భుతం సెలెక్ట్ మొబైల్స్‌కు సంబంధించిందే. ఇకపోతే.. ‘RRR’ నుంచి ఎన్టీఆర్ పరిచయ వీడియో వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ వీడియోతో మీ ముందుకు వస్తామంటూ ఇప్పటికే RRR టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu