HomeTelugu Newsహైదరాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో సందడిచేసిన ప్రభాస్

హైదరాబాద్‌ ఆర్టీఏ ఆఫీసులో సందడిచేసిన ప్రభాస్

Prabhas in Hyderabad RTA of
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సందడి చేశారు. ప్రభాస్‌తో ఫోటోలు దిగేందుకు ఆర్టీఏ అధికారులతో పాటు అక్కడకు వివిధ పనులతో వచ్చిన వాళ్లు ఎగబడ్డారు. ప్రభాస్ తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. ఈ సందర్భంగా అధికారులతో పాటు అక్కడున్న ప్రజలతో సెల్పీలు, ఫొటోలు దిగారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu