HomeTelugu Trendingఫాంహౌస్‌కు మకాం మార్చిన జక్కన్న

ఫాంహౌస్‌కు మకాం మార్చిన జక్కన్న

Rajamouli shifted to farm h
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తు సినిమా ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల సినిమా షూటింగ్ లకు అనుమతులు దొరికినా ఎవ్వరూ సాహసించడం లేదు. ఇక రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం తో ఇప్పుడప్పుడే షూటింగ్స్ జరిగేలా కనిపిచండం లేదు. దీంతో రాజమౌళి తన ఫాంహౌస్‌కు మకాం మార్చినట్టు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లికి సమీపంలో ఎదులూరు గ్రామంలో రాజమౌళి భారీ ఫాంహౌస్‌ను నిర్మించుకున్నాడు. షూటింగులు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆయన తన మకాంను అక్కడకు మార్చారు. అక్కడే ఉంటూ స్క్రిప్ట్ పనులు చూసుకోనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu