
Coolie Overseas Deal:
రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ మీద హవా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన నటిస్తున్న “కూలీ” సినిమాకు ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ విషయంలో భారీ రికార్డులు క్రియేట్ చేయబోతుందని టాక్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దాదాపు ₹80 కోట్లు వరకు ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్నారు.
ఇది అయితే ఒక తమిళ సినిమాకి వచ్చిన హయ్యెస్ట్ ప్రీ-రిలీజ్ ఓవర్సీస్ బిజినెస్ అవుతుంది. రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ మీదే కాదు, ఈ సినిమా ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)’ లో భాగంగా ఉంటుందన్న ఊహాగానాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారీ మేకింగ్, మాస్ ఎంటర్టైనర్ టచ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
ఇంకా ఫైనల్ డీల్ ఫిక్స్ అవ్వలేదు కానీ త్వరలోనే నిర్ణయం వస్తుందట. డీల్ క్లోజ్ అయితే తమిళ్ సినిమాలకు గ్లోబల్ గా ఓ కొత్త బెంచ్ మార్క్ ఏర్పడనుంది. ఇప్పటి వరకూ ఏ తమిళ్ సినిమా చేయని బిజినెస్‌ను “కూలీ” సాధించబోతోంది అన్నమాట.
ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. 2025 ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఇది ఇండిపెండెన్స్ డే కంటే ఒక్క రోజు ముందే కావడంతో ఫెస్టివల్ అడ్వాంటేజ్ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. స్టాండర్డ్, ఐమాక్స్ ఫార్మాట్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు.
“జైలర్” తర్వాత రజినీ నుంచి ఇది మరో భారీ మాస్ ట్రీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.