HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ భక్తుడిగా ఆర్జీవీ

పవన్‌ కల్యాణ్‌ భక్తుడిగా ఆర్జీవీ

varam as bandla ganesh
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘పవర్ స్టార్’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోలో టీ గ్లాసు ఉండడం వివాదంగా మారింది. అంతేకాదు ఎన్నికల తర్వాత కథ అంటూ పోస్టర్లు విడుదల చేశాడు. అయితే వర్మ ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీస్తున్నది కాదని చెబుతున్నా… పవన్ కళ్యాణ్‌‌ను ఉద్దేశించి తీస్తున్నట్లుగా చూస్తే తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వరుస పోస్టర్లు రిలీజ్‌ చేస్తూ సంచలనం రేపుతున్నాడు. పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్‌ను కొట్టినట్టు విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకరం కేవలం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించడమే కాదు.. అందులో ముఖ్యపాత్రను పోషించబోతున్నడట. పవర్ స్టార్ చిత్రంలో వర్మ.. బండ్ల గణేష్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో వర్మ.. అన్నా నువ్వు దేవుడవ్నా.. వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. నీకు తిరుగులేదు అనే టైపులో రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఉండబోతుందనేది సమాచారం. బండ్ల గణేష్ కమెడియన్ కమ్ నిర్మాత పాత్ర పోషిస్తే తెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu