
Salman Khan remuneration for Sikander:
బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘సికందర్’ తో ఫ్యాన్స్‌ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా 2025 ఈద్‌కి విడుదల కానుంది.
ఈ చిత్రంలో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయనతో కలిసి రష్మిక మందన్న, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్, డ్రామా, భావోద్వేగాలతో నిండిన కథతో ప్రేక్షకులను అలరించనుంది.
Thank u all for your birthday wishes.. much appreciated. Hope you like the teaser of Sikandar….#SikandarTeaser https://t.co/3odhAvSVgR #SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss@iamRashmika @DOP_Tirru@NGEMovies @WardaNadiadwala#SikandarEid2025 pic.twitter.com/5f2pQBngYE— Salman Khan (@BeingSalmanKhan) December 28, 2024
సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. రూ. 100–150 కోట్ల వరకు ఫీ తీసుకునే సల్మాన్, సికందర్‌కి అయితే దీని కంటే ఎక్కువగా పారితోషికం పొందుతున్నట్లు సమాచారం.
సల్మాన్ 59వ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 27న టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా అది డిసెంబర్ 28, ఉదయం 11:07కి విడుదల అయ్యింది. ‘సికందర్’ తర్వాత సల్మాన్ ‘కిక్ 2’ లో కనిపించనున్నారు.
ALSO READ: Hyderabad లో Celebrity Restaurants హవా మామూలుగా లేదుగా!