
Shah Rukh Khan Mannat:
బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్, ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన, ఇప్పుడు తన ప్రముఖ బంగ్లా మన్నత్ కు సంబంధించిన వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. ముంబయి బాంద్రా ప్రాంతంలోని ఈ బంగ్లా మీద ప్రభుత్వానికి ఎక్కువగా చెల్లించిన రూ.9 కోట్లు రీఫండ్‌గా అందుకోనున్నారని సమాచారం.
2001లో షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ తమ మన్నత్ బంగ్లాను లీజ్ ద్వారా తీసుకున్నారు. ఈ 2,446 చదరపు మీటర్ల స్థలానికి సంబంధించిన లీజ్ ఒప్పందం ప్రకారం, 2019లో వారు రూ.27.50 కోట్లు చెల్లించారు. కానీ ప్రభుత్వ అధికారులు స్థలంపై కాకుండా బంగ్లా మొత్తం విలువను లెక్కించి ఎక్కువగా చెల్లించేందుకు కారణమయ్యారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ లెక్కింపు పొరపాటును గుర్తించిన షారుఖ్ ప్రభుత్వం వద్ద పిటిషన్ వేశారు. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రీఫండ్ మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒక పాత వీడియోలో షారుఖ్ ఖాన్ తన జీవితంలో ఎదురైన మాఫియా బెదిరింపుల గురించి మాట్లాడారు. “బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే పెద్ద సినిమాలు నిర్మించే పరిశ్రమ. అందుకే మాఫియా మా సినిమాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంది,” అని చెప్పారు.
తనను సినిమాల్లో నటించమని మాఫియా ఎలా బెదిరించిందో వివరించారు. ఒకప్పుడు పోలీసు రక్షణతో మూడేళ్లు గడిపినట్లు చెప్పారు.
ALSO READ: Virender Sehwag సంపాదన ఎంత.. నెట్ వర్త్ తెలిస్తే షాక్!