
300 Crore Offer for Shah Rukh Khan:
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కి చెందిన మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాకి షారుఖ్ కి రూ.300 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారంటూ గాసిప్స్ వచ్చాయి. దర్శకుడిగా సుకుమార్ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. సినిమాకు మొత్తం బడ్జెట్ రూ.800 నుండి రూ.1000 కోట్ల వరకూ ఉంటుందని ఊహాగానాలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు దీనిపై నిజాలు వెలుగులోకి వచ్చాయి. పింక్‌విల్లా రిపోర్ట్ ప్రకారం, ఈ వార్తల్లో ذر మాత్రం నిజం లేదని షారుఖ్‌కి దగ్గర ఉన్న వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ప్రస్తుతం షారుఖ్ తన తదుపరి సినిమా ‘కింగ్’ మీదే పూర్తిగా ఫోకస్ చేశారట. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఇప్పటి వరకు ఎటువంటి సమావేశాలు జరగలేదని, కథే finalize కాలేదని సమాచారం.
View this post on Instagram
షారుక్ ప్రస్తుతం 2026 మొదటి త్రైమాసం వరకు కింగ్ సినిమా పనుల్లో బిజీగా ఉండనున్నారు. 2025 చివర్లో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచించనున్నారట. అనేక కథలు, ఆఫర్స్ వస్తున్నప్పటికీ, వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ లేదని క్లియర్ అయ్యింది.
ఇదిలా ఉండగా, కింగ్ సినిమాకి సంబంధించిన వార్తలు కూడా అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. దీపికా పదుకోన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అర్షద్ వార్సీ, అనిల్ కపూర్, జైదీప్ అహ్లావత్, రాణి ముఖర్జీ, అభయ్ వర్మ, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్ క్యాస్ట్ ఇందులో నటిస్తున్నారు.