HomeTelugu Trendingహీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సుమ కొడుకు

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సుమ కొడుకు

Suma son entry as a hero inటాలీవుడ్‌లో ఇప్పటికే చాలమంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సస్‌ అయ్యారు. తాజాగా కనకాల ఫ్యామిలీ వారసుడు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.కనకాల ఫ్యామిలీ ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉంటున్న సంగతి తెలిసిందే. నటుడు దర్శకుడు దేవదాస్ కనకాల హైదరాబాద్ లో యాక్టింగ్ స్కూల్ కూడా ఏర్పాటు చేసి ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ఆర్టిస్టులుగా వెలుగొందతున్న చాలా మంది ఈ స్కూల్‌లో నటన నేర్చుకున్నవారే. ఆయన భార్య లక్ష్మీ కనకాల కూడా పలు సినిమాల్లో నటించారు. దేవదాస్ కొడుకు (రాజీవ్ కనకాల) నటిస్తున్నారు. ఇక కుమార్తె (శ్రీలక్ష్మి) కూడా సినిమాల్లో నటించేవారు. రాజీవ్ కనకాల భార్య సుమ బుల్లితెరపై స్టార్‌ యాంకర్. ఇప్పుడు రాజీవ్ – సుమ వారసుడు రోషన్ కనకాల టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రోషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మరో నిర్మాణ సంస్థతో కలిసి సుమ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. కాగా ఇప్పటికే రోషన్ కనకాల శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu