తెలుగు NewsTelugu Big Storiesమెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే అదిరిపోయే అప్డేట్‌

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే అదిరిపోయే అప్డేట్‌

Hari hara veera mallu movie

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ శక్తిమంతమైన బందిపోటు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ అప్డేట్‌ ఇచ్చారు మేక‌ర్స్. ఇటీవ‌ల ఈ సినిమా నుండి డైరెక్టర్‌ క్రిష్ తప్పుకున్నాడు అని, అనుష్క‌తో ఓ కొత్త చిత్రం చేస్తున్న‌ట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈక్ర‌మంలో ఇప్పుడు ఈ మూవీ నిర్మాత‌లు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ సినిమా ఆగిపోలేద‌ని వీఎఫ్ఎక్స్‌, ఇత‌ర ప‌నుల‌లో బిజీగా ఉన్న‌ద‌ అని తెలిపారు.

ప్ర‌స్తుతం ఇరాన్‌,కెన‌డా ,బెంగ‌ళూరు,హైద్రాబాద్‌లోని హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అంతర్జాతీయ నిపుణులు ‘హరిహర వీరమల్లు’ గ్రాఫిక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్ నైపుణ్యానికి నిదర్శనంలా, ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో సన్నివేశాలను గ్రాఫిక్స్ తో మిళితం చేసి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకువస్తామని, ఆడియన్స్ విపరీతమైన ఉద్విగ్నతకు గురికావడం ఖాయమని పేర్కొంది. ఎలాంటి రూమ‌ర్స్ న‌మ్మోద్ద‌ని వెల్లడించింది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu