తెలుగు NewsTelugu NewsKeerthi Suresh: అసభ్యంగా ప్రవర్తించిన వాడి చెంప పగలకొట్టిన నటి

Keerthi Suresh: అసభ్యంగా ప్రవర్తించిన వాడి చెంప పగలకొట్టిన నటి

keerthy suresh hit the manKeerthi Suresh: ‘మహానటి’ ఫేం కీర్తి సురేష్‌ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. టాలీవుడ్‌లో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆతరువాత వరుస సినిమాతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది.

ఇప్పటి వరకూ మలయాళం, తమిళం, తెలుగు భాష అలరించిన కీర్తి.. తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తాను హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

నేను నా స్నేహితులతో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో కలిసి వెళ్తున్నాను. అప్పుడు ఒక అతను డ్రింక్ చేసి అటుగా వెళుతూ నా వెనుక వైపు తాకాడు. నాకు కోపం వచ్చి వెంటనే అతని చెంపలు వాయించాను. ఆ టైమ్‌లో అతడు నాపై దాడి చేసి తలపై కొట్టాడు.

అనంతరం అతన్ని చితకబాదీ పోలీసులకు అప్పగించాము. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రాత్రి మొత్తం స్టేషన్ లో పెట్టి ఉదయాన్నే రిలీజ్ చేశారు అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu