తెలుగు NewsTelugu Newsరకుల్‌ పెళ్లి కార్డు వైరల్‌

రకుల్‌ పెళ్లి కార్డు వైరల్‌

Rakul wedding card is viralహీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నానీల పెళ్లి ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరు తర్వలో ఒకటి కాబోతున్నారు. ఇటీవలే వీరి బ్యాచిలర్‌ పార్టీ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో వీరి వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్‌దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రింట్ చేశారు.

గోవాలోనే తమ పెళ్లి వేదికగా ఎంచుకోవడం వెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్‌లో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫాల్తు, అజాబ్ గజాబ్ లవ్, రాంగ్రేజ్, యంగిస్థాన్ వంటి సినిమాల్లో నటించాడు.

2009లోనే కన్నడ సినిమా గిల్లీతో రకుల్ ప్రీత్‌సింగ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యారియాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనంతరం దేదే ప్యార్ దే, రన్‌వే 34, చాత్రివాలీ, ఐ లవ్‌ యూ, డాక్టర్ జీ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ స్టార్‌ హీరోలతో పలు సినిమాలు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu