తెలుగు NewsTelugu NewsVikram 62: కీలక పాత్రలో తమిళ నటుడు

Vikram 62: కీలక పాత్రలో తమిళ నటుడు

Sj suryah in vikram 62 movi

Vikram 62: తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షనక్షలో వస్తున్నన ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది. ఈ టీజర్‌లో విక్రమ్‌ పాముని రెండు ముక్కలుగా చెయ్యడం, అతని లుక్‌, యాక్షన్‌ అన్నీ కూడా నెటిజన్లు బాగా ఆకట్టుకున్నాయి.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈక్రమంలో విక్రమ్‌ మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విక్రమ్‌కు 62వది.

దీంతో విక్రమ్ 62 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమాను తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో విలక్షణ నటుడు ఎస్ జే సూర్య నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. కాగా ఈసినిమాను హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా జీవీప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu