తెలుగు NewsTelugu Newsఊరు పేరు భైరవకోన భయపడుతూనే చూడాలనిపిస్తుంది: సందీప్‌ కిషన్‌

ఊరు పేరు భైరవకోన భయపడుతూనే చూడాలనిపిస్తుంది: సందీప్‌ కిషన్‌

sundeep kishan

టాలీవుడ్‌ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.

ఈ కథ అంతా కూడా ఒక మిస్టీరియస్ గా అనిపించే ఒక విలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నేను బసవలింగం అనే పాత్రను పోషించాను. దొంగగా ఫైట్ మాస్టర్ గా కనిపిస్తాను. మిస్టిక్ థ్రిల్లర్ హారర్ అడ్వెంచర్ అనే జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.

దేవుడు పురాణాల ప్రస్తావన కూడా ఉంటుంది. ఈ తరహా సినిమాలు నాకు చాలా ఇష్టం .. అందువల్లనే చేశాను” అని అన్నాడు. విరూపాక్షకు ఈ సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు అని. “ఈ సినిమా భయపెడుతుంది .. భయపడుతూనే చూడాలనిపించేలా ఉంటుంది.

అలా అని ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూసే సినిమా కాదు ఇది. ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. లవ్, రొమాన్స్ , యాక్షన్, ఎమోషన్ , అడ్వెంచర్ ఇలా ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. వీఐ ఆనంద్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పాడు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu