తెలుగు NewsTelugu NewsVarsha Bollamma: ఆ హీరోతో ప్రేమ- పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ

Varsha Bollamma: ఆ హీరోతో ప్రేమ- పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ

Varsha Bollamma comments onVarsha Bollamma: టాలీవుడ్‌లో వర్ష బొల్లమ్మ.. చూసి చూడంగానే, జాను, మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో నటించింది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.
ఈక్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా.. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు టీమ్‌. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ ప్రేమ, పెళ్లి వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

గతంలో స్వాతిముత్యం సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ తో వర్ష ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తన పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసింది వర్షా.

‘మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా.. ఇద్దరం కలిసి బయట తిరిగినా ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు. ఎప్పుడూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ.. నేను ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవ్వడం.. తన పోస్టులకు నేను రియాక్ట్ కావడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉంటుంది. మా మధ్యలో ఇలాంటివి ఏమి జరగలేదు. నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్స్ అంతే. కానీ మా మధ్య ఇలాంటి రూమర్ విని షాక్ అయ్యాను. ఆ తర్వాత దానికి కరెక్ట్ గా రిప్లై కూడా ఇచ్చాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu