తెలుగు NewsTelugu Reviews'డెవిల్' మూవీ రివ్యూ

‘డెవిల్’ మూవీ రివ్యూ

devil movie review

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా ‘డెవిల్’. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలై పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం..

ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటుంది. అలాంటి టైంలోనే బోస్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను డెవిల్ ఓ కంట కనిపెడుతుంటాడు. అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఈ కథలో సుభాష్ చంద్రబోస్‌కు రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ ఎవరు? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? సముద్ర (వశిష్ట), షఫీ (షఫీ), జబర్దస్త్ మహేష్ (శేఖర్) పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

ఈ సినిమాకథ, కథనాలు, తీసుకున్న పాయింట్ ఇవేవీ కూడా కొత్తగా అనిపించవు. కానీ సెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. 1945 ప్రాంతాన్ని ఎంచుకోవడం, సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించడం మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇందులో కథను రాసుకున్న తీరు, దీనికి క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను యాడ్ చేసేందుకు అన్నట్టుగా హత్య జరగడం, ఆ కేసును చేదించే క్రమంలో ఒక్కో పాయింట్ ఆడియెన్స్‌కు రివీల్ అవుతుంటాయి.

సినిమా అంతా నెమ్మదిగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఏదో ఇంట్రెస్ట్‌‌గానే తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయారేమోననిపిస్తుంది. పాటలు కథకు సంబంధం లేకుండా వస్తాయి. ద్వితీయార్దంలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు పర్వాలేదు అనిపిస్తాయి. అవి మరీ అంత గొప్పగా అనిపించవు. ఇక క్లైమాక్స్‌కు వచ్చే సరికి ఈ డెవిల్ ఓ సగటు తెలుగు కమర్షియల్ సినిమాగా మారుతుంది.

ఫస్ట్ హాఫ్‌లో హర్షవర్దన్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా అనిపిస్తుంది. సినిమా సెటప్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ బాగుంది. సినిమా చాలా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాతగా అభిషేక్ సక్సెస్ అయ్యాడు. కానీ దర్శకుడిగా మాత్రం అంతగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. పాటలు గుర్తుండకపోయినా.. మాటలు అక్కడక్కడ మెప్పిస్తాయి.

కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు షేడ్స్‌లో అద్భుతంగా కనిపిస్తాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్ ఎలా కుమ్మేస్తాడో అందరికీ తెలిసిందే. మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంటుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపిస్తుంది. కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu