తెలుగు NewsTelugu Reviewsసెంటిమెంట్‌తో కొట్టిన 'సైంధవ్‌'

సెంటిమెంట్‌తో కొట్టిన ‘సైంధవ్‌’

Saindhav Movie Reviewవెంకటేష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం సైంధవ్‌. ఈ సినిమా నేడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేశ్ కొలను ఇది వెంకటేష్‌కి 75వ చిత్రం కావడం మరో విశేషం. దీంతో విడుదలకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రమోషన్స్‌ కూడ గట్టిగానే చేశారు. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా విడుదలైన గుంటూరు కారం, హానుమాన్‌ సినిమాలు థియేటర్లల్లో సందండి చేస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులును ఎంత వరకూ ఆకట్టుకుంది. ఈ సంక్రాంతి రేసులో మిగతా సినిమాల దాడిని తట్టుకుని నిలబడుతుందా చూద్దాం..

దక్షిణ భారతదేశంలోని చంద్రప్రస్థ అనే సిటీలో పెద్ద కార్టెల్‌ను రన్ చేస్తూ ఉంటుంది ఓ బ్యాచ్. కార్టెల్ అంటే ఏం లేదు.. అమాయకులైన కుర్రాళ్లని, వయలెంట్ గేమ్స్‌కి (పబ్‌జీ) బానిసలైన యూత్‌కి శిక్షణ ఇచ్చి, గన్స్ ఎలా వాడాలో నేర్పించి.. ఉగ్రవాదులకి సప్లయి చేయడమే వీరి లక్ష్యం. ఇక దీనికి మిత్ర (ముకేష్ రిషి) లీడర్. ఇక వీరు అనుకున్నట్లుగానే 3 వేల మంది కుర్రాళ్లని ట్రైన్ చేసి గన్స్‌తో ఉగ్రవాదులకి చేర్చే బాధ్యతను కార్టెల్ మెంబర్ వికాశ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి అప్పగిస్తాడు మిత్ర. వీళ్ల చేతికి రావాల్సిన ఆయుధాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేస్తారు. మరోవైపు పోర్ట్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తూ తన కూతురే (బేబీ సారా) సర్వస్వం అనుకుంటూ బతుకుతుంటాడు సైంధవ్ (వెంకటేష్). పాపను జాగ్రత్తగా చూసుకుంటూ సైంధవ్‌ని ప్రేమిస్తుంటుంది మనో (శ్రద్ధా శ్రీనాథ్).

అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైమ్‌లో తన కూతురికి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని సైంధవ్‌కి తెలుస్తుంది. దీని నుంచి పాపని కాపాడాలంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. దాని విలువ రూ.17 కోట్లు అని తెలిసి తల్లడిల్లిపోతాడు సైంధవ్. ఈ ఆరోగ్య సమస్యతో బాధ పడే పిల్లలు ఆ సిటీలో 300కి పైగా ఉన్నారని అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ చెబుతుంది డాక్టర్ రేణు (రుహానీ శర్మ). ఈక్రమంలో సైంధవ్‌కి కార్టెల్ గ్యాంగ్‌కి మధ్య గొడవ జరుగుతుంది. సైంధవ్‌ని చూసి సైకో (Saiko) అంటూ వాళ్లంతా గజగజ వణకిపోతారు. అసలు ఈ సైకో ఎవరు? సైంధవ్ గతం ఏంటి? మరి తన పాపతో పాటు మిగిలిన చిన్నారుల ప్రాణాలను సైంధవ్ కాపాడాడా? కుర్రాళ్ల చేతికి తుపాకులు ఇచ్చి బీభత్సం సృష్టించాలనుకుంటున్న వాళ్లని సైంధవ్ అడ్డుకున్నాడా? అనేది కథ.

Saindhav 1

డైరెక్టర్ శైలేశ్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టోరీ లైన్‌ను ట్రైలర్‌లోనే చెప్పేస్తాడు. అంతా చెప్పేస్తే ఇంక ఇంట్రెస్టింగ్ ఏముంది అనుకునే వారిని తన స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్‌తో ఆకట్టుకుంటాడు. ఇదే ఫార్ములాను హిట్, హిట్ -2కి వాడి సూపర్ హిట్లు అందుకున్నాడు. సరిగ్గా సైంధవ్‌కి కూడా ఇదే ఫార్ములాను ట్రై చేశాడు. స్టోరీ అంతా మనకి తెలిసినా దాన్ని చూపించే విధానంతో ఆకట్టుకున్నాడు. వెంకటేష్ ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాడు. కామెడీ, యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ ఇలా ప్రతి జోనర్‌‌ను టచ్ చేశారు. కానీ సైంధవ్ సినిమాలో మాత్రం వెంకీ తో కొత్త ప్రయోగమే చేశాడు దర్శకుడు. సినిమా మొత్తం హై యాక్షన్ సీన్లు చేయిస్తూనే వెంకీ మార్క్ ఎమోషన్, సెంటిమెంట్‌ను బయటికి తీశాడు. సినిమా మొత్తం చాలా స్టైలిష్‌గా ఉంది.

సినిమా మొదటి అరగంట నెమ్మదిగా సాగుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం వెంకీ మామతో పాటు స్టోరీ కూడా ఊపందుకుంటుంది. ముఖ్యంగా ‘సైకో ఈజ్ బ్యాక్’ అంటూ విలన్లు గజగజలాడే సీన్లలో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్లో విలన్లకి వెంకీ వార్నింగ్ ఇచ్చే సీన్ సినిమాకే హైలైట్‌. సెకండాఫ్‌యే సినిమాని నిలబెట్టింది. ఓవైపు యాక్షన్ సీన్లను హోరెత్తిస్తూనే ఎమోషనతో హార్ట్ టచ్ చేశాడు డైరెక్టర్. ఇక క్లైమాక్స్‌లో సీక్వెల్‌కి కూడా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. మైనస్ విషయాలకొస్తే శైలేశ్ తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. దాన్ని ఇంకా డెవలప్ చేసుంటే సినిమా ఇంకా బాగుండేది. ముఖ్యంగా సైకోను చూసి ఎందుకు అందరూ అంత భయపడుతున్నారు అనేది ఇంకా ఎలివేట్ చేసుంటే బాగుండేది.

సినిమాలో వెంకీ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇటువంటి సెంటిమెంట్‌ పాత్రలు చేయడంతో వెంకటేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. కొన్ని సీన్లలో వెంకటేష్‌ని చూసినప్పుడు ఆడియన్స్‌కి తెలీకుండానే గుండె బరువెక్కిపోతుంది. ముఖ్యంగా తన కూతురిని కాపాడుకోలేకపోతున్నాననే బాధ గుండెను కోసేస్తున్నా నవ్వుతూనే తన పాపతో మాట్లాడే సీన్ వేరే లెవల్‌లో ఉంది. వెంకటేష్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఇక సినిమాలో మరో హైలెట్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన.

బాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నవాజుద్దీన్‌కి ఇదే మొదటి తెలుగు సినిమా. ఇక దీనికి ఆయనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఈ సినిమాతో నవాజుద్దీన్ బిజీ తెలుగులో మరన్ని అవకాశలు రావడం పక్క. ఇక మనో పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ సరిగ్గా సరిపోయింది. వెంకటేష్ కూతురు గాయత్రిగా బేబీ సారా నటన అందరినీ ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలబడేలానే ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu