తెలుగు NewsTelugu Trendingరజనీకాంత్‌ 'లాల్‌ సలాం' వాయిదా!

రజనీకాంత్‌ ‘లాల్‌ సలాం’ వాయిదా!

Lal Salam update

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘లాల్‌ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది.

ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి లాల్‌ సలాం చిత్రాన్ని తప్పిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి చాలా వరకు భారీ సినిమాలు ఉన్నాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’ చిత్రాలు కోలీవుడ్‌లో రెడీగా ఉన్నాయి. అంతే కాకుండా జైలర్‌ సినిమాతో తెలుగులో కూడా రజనీ మార్కెట్‌ భారీగానే పెరిగింది.

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ నుంచి గుంటూరు కారం, ఈగల్‌, నా సామిరంగా,సైంధవ్‌, హనుమాన్‌ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని పరిస్థితి టాలీవుడ్‌లో ఉంది. ఇలాంటి టైమ్‌లో మరో మూడు తమిళ సినిమాలు అంటే థియెటర్ల కొరత ఏర్పడటం జరుగుతుందని లాల్‌ సలాం టీమ్‌ ఆలోచిస్తుందట. మరి దీనిలో నిజమెంత ఉందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu