తెలుగు NewsTelugu Trendingధైర్యం ఉంటే నా ఫొటో, పేరు తో ఆర్టికల్‌ రాయి.. ఆ వెబ్‌సైట్‌కు డైరెక్టర్‌ స్ట్రాంగ్‌...

ధైర్యం ఉంటే నా ఫొటో, పేరు తో ఆర్టికల్‌ రాయి.. ఆ వెబ్‌సైట్‌కు డైరెక్టర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Director strong warning toమాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు.

ఫిబ్రవరి 9న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఈ మూవీ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఓ వెబ్ సైట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ధైర్యముంటే తన ఫొటో వేసి ఆర్టికల్ రాయమని మాస్ కామెంట్స్ చేశాడు.

తాజాగా ఈగల్ సక్సెస్ మీట్‌లో కూడా మరోసారి తన ఆవేదనను బయటపెట్టాడు. ఓ గాసిప్ వెబ్ సైట్‌పై హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు. గ్రేట్ వెబ్ సైట్ అంటూ పీపుల్స్ మీడియా సంస్థ కూడా అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. ఆ వెబ్ సైట్ ఈగల్ సినిమాకు 1.5 రేటింగ్ ఇచ్చింది. అదే వెబ్ సైట్ యాత్ర 2 మూవీకి 3 రేటింగ్స్ ఇచ్చింది. దీనిపై ఇదివరకే ట్విటర్‌లో కౌంటర్స్ వేసిన హరీష్ శంకర్ తాజాగా ఫైర్ అయ్యాడు.

“ఓ వెబ్ సైట్ ఇలానే రాస్తుంటుంది. ఎందుకు ఇలా కొత్త టీమ్ చేసిన ప్రయత్నాన్ని నీరు గార్చడం. రెండో సినిమాతో దర్శకుడు నిలబడాలనుకున్న ఓ కెమెరామెన్‌ను, వంద సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న నిర్మాతను ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మా సినిమా వాళ్లకు ఈ ట్రోలింగ్ కొత్తేం కాదు. అన్నీ తెగించే ఇండస్ట్రీలోకి వచ్చాం. సినిమాలు పుట్టాకే వెబ్ సైట్స్ పుట్టాయి” అని హరీష్ శంకర్ చురకలు అంటించాడు.

“ఓ వెబ్ సైట్ మరీ దారుణంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. ఓ డైరెక్టర్ నాలుగేళ్లుగా సినిమా తీయట్లేదు. రాత్రంతా తాగుతూ ఉన్నాడు. గతంలో పవన్ కల్యాణ్‌తో బ్లాక్ బస్టర్ తీశాడు అని రాస్తారు. ఫొటో వేయరు. అది ఇంకెవరు నేనే. నా ఫొటో, పేరు రాసే ధైర్యం లేదు. ధైర్యం ఉంటే నా ఫొటో వేసి రాయండి. నేను కౌంటర్ ఇస్తాను. నువ్వేమైనా నాకు పెగ్గు కలిపావా. ఐస్ వేశావా. నీకు తెలుసా. మనం ఒకే జట్టుగా ఉన్నాం. మీరు ఆ గట్టు మీద, మేము ఈ గట్టు మీద లేము” అని హరీష్ శంకర్ అన్నాడు.

“అందరం కలిస్తేనే సినీ పరిశ్రమ కాదు. కూడదు.. ఇలానే నెగెటివ్ ఆర్టికల్స్ రాస్తాం. మీ సినిమాలు వస్తాయి కదా. మీ సంగతి చూస్తాం అనుకుంటే మీ అభిమాన హీరో చెప్పిన డైలాగ్, చేసిన సింబల్ గుర్తుంది కదా” నా బొచ్చు కూడా పీకలేవు..అని ఆ సైగ చేశాడు హరీష్ శంకర్. దీంతో హరీష్ శంకర్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu