HomeTelugu Big Storiesఒకే ఒక్క సన్నివేశం కోసం Thalapathy Vijay ఇంత పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారా?

ఒకే ఒక్క సన్నివేశం కోసం Thalapathy Vijay ఇంత పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారా?

Thalapathy విజయ్ bought remake rights for one episode?
Thalapathy విజయ్ bought remake rights for one episode?

Thalapathy Vijay Last Movie:

ఇలయదళపతి విజయ్ చివరిసారిగా నటిస్తున్న సినిమా జన నాయకన్ గురించి తాజాగా ఒక ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా డైరెక్షన్ H. వినోత్ చూస్తుండగా, KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. రాజకీయాలు, సామాజిక అంశాలు కలిపిన స్టోరీతో ఇది రూపొందుతోంది. సినిమాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉండబోతోందట.

ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం, విజయ్‌ ‘భగవంత్ కేసరి’ సినిమాను రీమేక్ చేస్తున్నారనే మాటలున్నాయి. కానీ అసలు విషయం ఇంకొంచెం డిఫరెంట్‌గానే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Thalapathy Vijay (@actorvijayoffi_)

‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్య మరియు శ్రీలీల మధ్య వచ్చే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అనే ఎమోషనల్ ఎపిసోడ్‌ మనందరికీ గుర్తుండే ఉంటుంది. అదే సీన్‌ విజయ్‌ను ఎంతగానో కదిలించింది. దీంతో ఆ ఒక్క సీన్‌ను తన సినిమా ‘జన నాయకన్’లో ఉపయోగించాలనే ఉద్దేశంతోనే నిర్మాతలతో మాట్లాడి, సినిమా రీమేక్ హక్కులను కొన్నారు.

ఈ డీల్ కోసం విజయ్ టీమ్ భగవంత్ కేసరి నిర్మాత సాహు గరపాటిని సంప్రదించగా, వారు 4.5 కోట్ల రూపాయలకు రీమేక్ హక్కులను విక్రయించారు. అయితే, జన నాయకన్ స్టోరీకి భగవంత్ కేసరికి వేరే ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆ ఒక ఎపిసోడ్‌ కోసమే హక్కులు తీసుకున్నారు.

ఇప్పుడు ఈ విశేషం తమిళ్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. విజయ్ నటనతో ఆ సీన్ ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో చూడాలి. ఇక సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ALSO  READ: Subham OTT షాక్: జీ డీల్ క్యాన్సల్ అవుతుందా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!