HomeTelugu Trendingలవర్‌తో శర్వానంద్ పెళ్లి..

లవర్‌తో శర్వానంద్ పెళ్లి..

tollywood Hero sharwanand t
టాలీవుడ్‌ ప్రస్తుతం పెళ్లీల సీజన్‌ నడుస్తుంది. ఇప్పటికే.. హీరోలు నిఖిల్‌, నితిన్‌, రానా ద‌గ్గుబాటి వివాహ‌లు చేసుకొని ఓ ఇంటివార‌య్యారు. మ‌రోవైపు మెగా డాట‌ర్ నిహారిక ఎంగేజ్‌మెంట్ అవ‌గా.. తాజాగా మ‌రో యంగ్‌ హీరో శ‌ర్వానంద్ కూడా పెళ్లి కొడుకుగా ముస్తాబ‌వ‌నున్న‌ట్లు స‌మాచారం.

చిన్న‌నాటి స్నేహితురాలు, మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌తో ఈ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు చ‌క్కర్లు కొడుతున్నాయి. ఆయ‌న‌కు స్నేహితురాలిపై చిగురించిన ప్రేమ‌ను పెద్ద‌లు అర్థం చేసుకుని అంగీకారం తెలిపార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇదెంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేదానిపై శ‌ర్వానంద్ అధికారిక ప్ర‌క‌ట‌న చేసేవ‌ర‌కు వేచి చూడాల్సిందే. కాగా ప్ర‌స్తుతం శర్వానంద్‌ “శ్రీక‌రం” అనే సినిమాలో న‌టిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu