HomeTelugu Trendingకప్పెల తెలుగు రీమేక్‌లో విశ్వక్ సేన్!

కప్పెల తెలుగు రీమేక్‌లో విశ్వక్ సేన్!

6a 3

మ‌ల‌యాళంలో సంచలన విజయం సాధించిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` తెలుగులో ‘లూసీఫ‌ర్’ పేరుతో రీమేక్ కాబోతున్న విష‌యం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించి రూపొందించిన చిత్రం తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్నారు.

ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రీమేక్ చేస్తున్నారు. ఇదే నిర్మాత తాజాగా మ‌రో మ‌ల‌యాళ హిట్ సినిమా రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన ‘క‌ప్పెల‌’ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తే తెలుగులో ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌కు, మ‌హేష్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య వివాదాన్ని సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌లో విశ్వ‌క్‌సేన్ న‌టించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వ‌ర్గాలు విశ్వ‌క్‌సేన్‌ని సంప్ర‌దించాయ‌ని, ఇంకా అత‌ని నుంచి సిగ్న‌ల్ రాలేద‌ని తెలిసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ రీమేక్‌కు విశ్వ‌క్‌సేన్ బెస్ట్ ఛాయిస్ అని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ భావిస్తున్నార‌ట‌. మ‌రి విశ్వ‌క్‌సేన్ ఏమంటారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu