W/O రామ్‌ మూవీ రివ్యూ

movie-poster
Release Date
July 20, 2018

సినిమా : W/O రామ్‌
నటీనటులు : మంచు లక్ష్మీ, ప్రియదర్శి, ఆదర్శ్‌, సామ్రాట్‌
దర్శకత్వం : విజయ్‌ ఎలకంటి
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబోట్ల, మంచు లక్ష్మీ
సంగీతం : రఘు దీక్షిత్‌

మంచు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. పలు విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పించే ఆమె తాజాగా W/O రామ్‌ చిత్రంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు తెలర మీద అరుదుగా కనిపించే క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్‌ ఎలకంటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టీజర్‌, ట్రైలర్‌లతోనే ఆసక్తి నేలకొల్పిన W/O రామ్‌ ప్రేక్షకులను ఏ మేరకు ఆకర్షిస్తుంది? మంచు లక్ష్మీ తన నటనను మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారా?

కథ: దీక్ష(మంచు లక్ష్మీ) ,రామ్‌ (సామ్రాట్‌) భార్యభర్తలు. ఓ ప్రమాదంలో దీక్ష భర్తను, కడుపులోని బిడ్డను కోల్పొతుంది. అప్పటి వరకు పోలీసులు ఈ కేసును ప్రమాదం అనుకుంటారు. కాని దీక్ష తన భర్తకు జరిగింది ప్రమాదం కాదని, హత్యచేశారని, హుడీ వేసుకున్న వ్యక్తి తనను గయపరిచి తన భర్తను లోయలో పడేశాడని చెపుతుంది. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎంతకు ముందుకు కదలకపోవడంతో తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే రమణ చారీ (ప్రియదర్శి) అనే కానిస్టేబుల్‌ దీక్షకు సాయం చేస్తాడు. ఎంతో కష్టపడి ఈ హత్య వెనుక ఉన్న వ్యక్తి రాఖీ( ఆదర్శ) అని దీక్ష తెలుసుకుంటుంది. ఈ ప్రయత్నంలో రాఖీ మనుషులు.. దీక్షను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రమాదాల నుంచి దీక్ష ఎలా తప్పించుకుంది..? తన భర్త మరణానికి కారణం ఏంటి? ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలేంటి? అన్నదే కథ.

నటీనటులు: ఈ కథలో మంచు లక్ష్మీ పాత్ర కీలకమైనది. కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఒకటి రెండు సన్నీవేశాలు తప్ప మిగతా అని సీన్స్‌ల్లో మంచు లక్ష్మీ కనిపిస్తుంది. ఇంత బాధ్యతను లక్ష్మీ సమర్థవంతంగా పూర్తిచేసింది. భర్తను కోల్పోయిన బాధను దిగమింగుతూ అతని హత్య వెనుక ఉన్న కారణాలు వెతికే మహి
ళగా మంచి నటన కనబరిచారు. కొన్ని ల్సిన్స్‌ల్లో ఆమె ఎమోషన్స్‌ను అండర్‌ ప్లే చేసిన తీరు సూపర్బ్‌ గా అనిపిస్తుంది. మరో కీలక పాత్రలో నటించిన ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. సిన్సియర్‌ కానిస్టేబుల్‌ పాత్రలో మెప్పించాడు. కరప్టడ్‌ పోలీస్‌ పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మంచి నటన కనబరిచాడు. ఆదర్శ్‌ విలన్‌ రోల్‌లో చాలా బాగా ఫిట్‌ అయ్యాడు. సామ్రాట్‌ది నటనకు పెద్దగా అవకాశం లేని పాత్ర.

విశ్లేషణ: దర్శకుడు విజయ్‌ ఎలకంటి తన మొదటి సినిమానే థ్రిల్లర్‌ జానర్‌లో చేసే ప్రయత్నంలో తన వంతు ప్రయత్నం చేశాడు. తాను అనుకున్న కథ నుంచి ఎక్కడా పక్కకుపోకుండా పర్పెక్ట్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. కమర్షయాలిటీ కోసం పాటలు, కామెడీ ఇరికించకుండా కథను నడిపించిన తీరు బాగుంది. అయితే థ్రిల్లర్‌ సినిమాలో ఉండాల్సిన వేగం మాత్రం కథనంలో లోపించింది. భర్త, బిడ్డను కోల్పోయిన మహిళను కుటుంబ సభ్యులు చుట్టాలు పట్టించుకోకపోడటం కూడా ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఆసక్తికరంగానే ఉన్నా.. తరువాత వచ్చే సీన్స్‌ ఆ స్థాయిలో లేవు అనే చెప్పాలి. సినిమా మేజర్‌ ప్లస్‌ పాయింట్స్‌ రఘ దీక్షిత్‌ మ్యూజిక్‌. చాలా సన్నివేశాలను రఘ మ్యూజిక్‌ డామినేట్‌ చేసి విధాగం అనిపిస్తుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయిలోనే ఉన్నాయి. ముగింపు వరకు కాస్త ఓపిగ్గా సినిమా చూడగలిగితే ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.

హైలైట్స్
మంచు లక్ష్మీ నటన
రఘ దీక్షిత్‌ మ్యూజిక్‌

డ్రాబ్యాక్స్
ఎడిటింగ్‌
కథనంలో వేగం లోపించడం

చివరిగా : W/O రామ్‌ అంతంత మాత్రంగానే ఉంది.
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 2
Total Critics:2

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

W/O రామ్‌ అంతంత మాత్రంగానే ఉంది.
Rating: 2/5

https://www.klapboardpost.com

చక్కటి థ్రిల్లర్ మూవీని కోరుకునే ఆడియెన్స్‌‌కు ఈ సినిమా నచ్చుతుంది.
Rating: 2.5/5

https://telugu.samayam.com