HomeTelugu Newsఇందిరా గాంధీ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి..!

ఇందిరా గాంధీ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటి..!

భారత మొట్ట మొదటి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ జీవితంపై రచయిత సాగరిక ఘోష్ ‘ఇందిర – ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకాన్ని రచించారు. ఈ బుక్ ఆధారంగానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు.

5 10

అయితే ఇది సినిమా రూపంలో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో ఉంటుందట. చూపించాల్సిన కంటెంట్ ఎక్కువ ఉండటం వలన వెబ్ సిరీస్ చేయనున్నట్లు విద్యా బాలన్ అన్నారు. ఇందులో ఇందిర పాత్రను విద్యా బాలన్ స్వయంగా పోషించనుండటం విశేషం. ఇక ఈ సిరీస్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu