HomeTelugu Newsత్రిష ఆ చిత్రంలో అందుకే నటించలేదట..

త్రిష ఆ చిత్రంలో అందుకే నటించలేదట..

ప్రముఖ నటి త్రిష కెరీర్‌ ఇప్పడు ఇబ్బందుల్లో పడింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఒకనాడు టాప్‌ హీరోయిన్‌గా చెలామణి అయిన త్రిష ఇప్పడు చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నది. తాజాగా ఆమె నటించిన మోహిని కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ నెలలో ఆమె నటిస్తున్న 96 విడుదల కాబోతుంది. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. త్రిషా కు సంబంధించిన ఓ వార్త హాల్‌చల్‌ చేస్తుంది.

1 2

చియాన్‌ విక్రమ్‌, త్రిష జంటగా 2003 లో సామి సినిమా వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం సంచలన విషయం సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌గా ఇప్పుడు సామి స్క్వేర్‌ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా హరినే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌ గా త్రిషాను అనుకున్నారట. కానీ, త్రిష ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించలేదట. కారణం ఏమిటంటే.. ఈ సామి స్క్వేర్‌ కథ తనకు తగ్గట్టుగా లేదని అందుకే ఈ సినిమాలో నటించలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్రిష వదులుకున్న అవకాశం కీర్తి సురేష్‌ కు దక్కింది. ఒకవేళ ఈ సినిమా హిట్టయితే .. త్రిష ఓ మంచి అవకాశం వదులుకున్నట్లే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu