HomeTelugu Newsదిశాపటానీకి వరుస ఆఫర్లు

దిశాపటానీకి వరుస ఆఫర్లు

లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ దిశాపటానీ ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆఫర్లు రావడంతో అక్కడే హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవల బాఘీ-2 మూవీతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ త్వరలో సల్మాన్ ఖాన్ మూవీ భరత్‌లో హీరోయిన్‌గా కనిపించనుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ మూవీలో ప్రియాంక చోప్రాతో పాటు దిశాపటానీ రెండో హీరోయిన్‌గా నటించబోతుంది.

4 14

తాజాగా దిశా పటానీకి మరో స్టార్ హీరో సరసన ఛాన్స్ వచ్చిందట. దాంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట. హృతిక్ రోషన్ హీరోగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుందట. ఆ సినిమాలో హీరోయిన్‌గా దిశాను అడిగితే వెంటనే ఓకే చెప్పేసిందట. కెరీర్‌ ఆరంభంలో మీడియం రేంజ్ హీరోలతో వచ్చిన అవకాశాలను వద్దనుకున్న ఈ భామ స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేయడంలో సక్సెస్ అవుతోందనే చెప్పాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu