లోకేశ్ కి గొప్ప అవకాశం.. వాడుకుంటే సీఎం అయిపోయినట్టే !

టీడీపీ భ‌విష్య‌త్ ర‌థ‌సార‌థి నారా లోకేశ్ పాద‌యాత్ర‌ పై నీలి మీడియా కూలీ రాగాలు తీస్తోంది. అందుకే న‌డిపించ‌డ‌మే లోకేశ్‌కు స‌వాల్‌ అంటూ విషపు ప్రచారాలు చేస్తున్నారు. ఏపీలో ప్ర‌ముఖ పుణ్య స్థ‌లాలు, దేవాల‌యాల‌ను సంద‌ర్శించి ఆశీస్సులు పొందేందుకు లోకేశ్ పూనుకుంటే దాన్ని కూడా తప్పుబట్టారు. లోకేశ్ పై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. ఎన్ని చేసినా లోకేశ్ పాదయాత్ర ఆపలేరు కదా. ఈ నెల 27న ఉద‌యం యువ‌గ‌ళం పేరుతో లోకేశ్ పాద‌యాత్ర ప్రారంభించబోతున్నాడు. 400 రోజుల్లో, 4 వేల కిలోమీట‌ర్లు లోకేశ్ తన పాద‌యాత్రగా టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ టార్గెట్ పూర్తి చేస్తే.. లోకేశ్ సక్సెస్ అయిపోయినట్టే. అప్పుడు ఏమో గుర్రం ఎగరావచ్చు ఏమో.

ప్రస్తుతం టీడీపీని అధికారం వైపు న‌డిపించ‌డ‌మే లోకేశ్ ముందున్న ల‌క్ష్యం. ఆ లక్ష్యం చేర‌డానికి లోకేశ్ ఆల్ రెడీ ప్రయత్నాలు ప్రారంభించాడు. రోజుల తరబడి కిలో మీట‌ర్లు నడిస్తే.. సీఎం అయిపోతారా అంటే ?, ఏమో అయిపోవచ్చు. జగన్ రెడ్డి అయిపోయాడు కదా. రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి. నిత్యం తమలో తిరిగే వాడినే తమ నాయకుడు అనుకుంటున్నారు జనం. ఈ లెక్కన పాదయాత్ర ముగిసే నాటికీ లోకేశ్ తమ నాయకుడు అని ప్రజలు అంగీకరించొచ్చు. జగన్ రెడ్డిని అలాగే అంగీకరించారు కదా.

లోకేశ్ చేయాల్సింది అల్లా ఒక్కటే. పాద‌యాత్రలో జ‌నంతో మ‌మేకం కావ‌డం. త‌న టార్గెట్ అధికార‌మ‌నే గెలుపు అని ప్రజలను ఒప్పించి తన వైపుకు తిప్పుకోవాలి. అయితే టీడీపీని అధికారం వైపు న‌డిపించ‌డం అంత సులువైన వ్య‌వ‌హారం కాదు. కానీ లోకేశ్ పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఏదో చేసేస్తాడు అని నమ్మకాలు లేవు. ఇది లోకేశ్ కి కలిసి వచ్చే అంశమే. లోకేశ్ కొంత చేసినా ఎంతో చెప్పుకుంటారు.

ఎందుకంటే వైఎస్ జ‌గ‌న్ రూపంలో అతి బ‌ల‌వంతుడైన ప్ర‌త్య‌ర్థి ఉన్నాడు. ఈ నేపథ్యంలో లోకేశ్ కొంచెం విజయం సాధించినా చాలు. ఎలాగూ న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును చిత్త‌శుద్ధితో అమ‌లు చేయడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యాడు. పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల నుంచి జగన్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అన్నిటికి మించి జ‌గ‌న్ పేరు చెబితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి లోకేశ్ కి ఇవన్నీ ప్లస్ కానున్నాయి. విచ్ఛిన్నం అయిపోయిన టీడీపీ ఓటు బ్యాంక్‌ను మళ్ళీ తెచ్చుకోవడానికి లోకేశ్ కి ఇంతకు మించిన గొప్ప అవకాశం మళ్లీ రాదు. ఈ ఛాన్స్ ఒడిసిపట్టుకుంటే లోకేశ్ సీఎం అయిపోయినట్టే. కాబట్టి.. లోకేశ్ పోరాడు. టీడీపీ పాల‌న‌లోనే రాష్ట్రానికి మంచి జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కాన్ని, భ‌రోసాని ప్ర‌జానీకంలో కలిగించు.

CLICK HERE!! For the aha Latest Updates