HomeTelugu Big Stories'రైటర్‌ పద్మభూషణ్‌' ట్రైలర్‌

‘రైటర్‌ పద్మభూషణ్‌’ ట్రైలర్‌

Actor suhas writer padmabhu
షార్ట్‌ ఫిలింస్‌, యూట్యూబ్‌ వీడియోస్‌తో కెరీర్‌ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్‌. ‘కలర్‌ ఫోటో’ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్‌ ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ లభించింది. ఇక సుహాస్‌ ఇటీవలే ‘హిట్‌-2’లో విలన్‌ పాత్ర పోషించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది.

తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు శణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించాడు. టీనా శిల్పరాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆశీష్‌ విద్యార్థి, రోహిణి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను చాయ్‌ బిస్కెట్‌ ఫిలింస్‌, లహరి ఫిలింస్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu