HomeTelugu Big Storiesహిట్‌-2' ట్రైలర్‌ పై అడివిశేష్‌ కామెంట్స్‌.. వైరల్‌

హిట్‌-2′ ట్రైలర్‌ పై అడివిశేష్‌ కామెంట్స్‌.. వైరల్‌

Adivi Sesh has seen the rus
అడివిశేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్‌-2’. సైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ‘హిట్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి పార్టులో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. సెకండ్‌ పార్టులో అడివిశేష్ నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమాను డిసెంబర్‌ 2న విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను అడివిశేష్ వెల్లడించాడు.

తాజాగా అడివిశేష్‌ సోషల్‌ మీడియాలో ‘హిట్‌-2’ ట్రైలర్‌ రఫ్‌ కట్‌ వెర్షన్‌ను చూశానని, ట్రైలర్‌ అద్భుతంగా ఉన్నట్లు ఫైర్‌ ఎమోజీస్‌ను సింబాలిక్‌గా పెట్టాడు. దాంతో నెటీజన్‌లు మాకు ఎప్పుడు ట్రైలర్‌ను చూపిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీనాక్షీ చౌదరీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కోమలి ప్రసాద్‌, రావు రమేష్‌ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నానితో కలిసి ‘బాహుబలి’ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu