HomeTelugu Big Storiesదేశంలో క్రేజీ స్టార్ల జాబితాలో అల్లు అర్జున్, దీపిక‌

దేశంలో క్రేజీ స్టార్ల జాబితాలో అల్లు అర్జున్, దీపిక‌

Allu Arjun name in Mood Of
వివిధ రంగాలలో భారతీయ ప్రముఖుల ప్రజాదరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్. ఇది ప్రతి ఏటా నిర్వహిస్తారు. సినీ పరిశ్రమలోని ప‌లువురు సెల‌బ్రిటీల పేర్లు ఇప్ప‌టికే ఇందులో హైలైట్‌గా నిలిచాయి. హీరోయిన్లలో దీపికా పదుకొణె గత 10 ఏళ్లుగా ఈ పోల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

అమితాబ్ చాలా కాలంగా భారతీయ సినిమాకి మూలస్తంభంగా నిల‌వ‌గా, అల్లు అర్జున్ ఇటీవ‌లే జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సంచ‌ల‌నం సృష్టించాడు. దేశంలో ఎక్కువ ఆక‌ర్ష‌ణ, ప్ర‌భావం ఉన్న స్టార్ల జాబితాలో అల్లు అర్జున్ పేరు కూడా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆస‌క్తిక‌రంగా క‌థానాయిక‌ల్లో దీపిక ప‌దుకొనే 10వ సారి స‌ర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని ద‌క్కించుకుంది.

న‌టిగా తిరుగులేని ప్రభావం చూపిస్తున్న దీపిక‌ పదుకొణె 2023లో జరిగిన MOTN పోల్‌లో 25 శాతం ఓట్లను సాధించి భారతదేశానికి చెందిన‌ అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన స్టార్‌గా నిలబడింది.

స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఈ ఏడాది కూడా నెం.1 స్థానంలో నిలిచింది. ఓటింగ్ ప‌రంగా చూస్తే భారీ తేడాతో త‌న హ‌వా సాగించింది. 10 శాతం ఓట్లతో కత్రినా కైఫ్ రెండో స్థానంలో నిలిచింది. అలియా భట్(9 శాతం), ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్(7 శాతం) ఓట్లతో తరువాతి స్థానాల్లో నిలిచారు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్ 27 శాతం ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా షారుక్ ఖాన్(22 శాతం), అక్షయ్ కుమార్(9 శాతం), సల్మాన్ ఖాన్(8 శాతం), అల్లు అర్జున్(6 శాతం) ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.అమితాబ్ బచ్చన్ ని బాలీవుడ్ షాహెన్‌షా అని అభిమానులు పిలుస్తారు.

మూస పద్ధతులను బ్రేక్ చేసి భారతీయ సినిమాను పునర్నిర్వచించిన ఐకానిక్ పాత్రలతో అమితాబ్ పాపుల‌ర్ అయ్యారు. ఇప్పుడు దీపికా పదుకొణె కూడా సామాజిక నిబంధనలను సవాలు చేయడానికి, రొటీనిటీ మోనోట‌నీ నుండి బయటపడటానికి ఇదే విధమైన ధోరణిని అవ‌లంబించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu