ప్రభాస్ కి అనుష్క కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకంటే….?

అనుష్క ప్రభాస్…వీళ్ళిద్దరూ బాహుబలికంటే ముందు బిల్లా,మిర్చి సినిమాల్లో కలిసి నటించినప్పటికీ వీరికి సంబంధించిన అఫైర్స్ పై ఎలాంటి రూమర్స్ కూడా ప్రచారం కాలేదు.కాకపోతే బాహుబలి మొదటిపార్ట్ వరకు లైటర్ మోడ్ లో ఉన్న వీరి రిలేషన్ పై బాహుబలి కంక్లూషన్ తరువాత మాత్రం ఒక రేంజ్ ప్రచారం జరిగింది.ఇక వీళ్ళు పెళ్లి చేసుకోవడమే లేట్ అంటూ బోలెడన్ని స్టోరీస్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చక్కెర్లు కొట్టాయి.కొంతమంది అయితే అత్యుత్సాహంతో ఎంగేజిమెంట్ డేట్స్ కూడా రాసేశారు. దాంతో హర్ట్ అయిన అనుష్క ఇంకోసారి తమపై ఇలాంటి ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ ఈ రూమర్స్ కి అప్పటివరకు తాత్కలికంగా ఫుల్ స్టాప్ పెట్టగలిగింది.కానీ వయసు పెరిగిపోతున్న ఇటు అనుష్కగాని,అటు ప్రభాస్ గాని పెళ్లి మాట ఎత్తకపోవడం,ఒకరి కంపెనీ ని ఇంకొకరు ఎంజాయ్ చెయ్యడం,సాహో సినిమాకి అనుష్కని రికమెండ్ చేసి బరువు తగ్గడానికి టైం ఇవ్వడం వంటివి చూసి మళ్ళీ ఈ గుసగుసలు మొదలయ్యాయి.ఆ మధ్య ప్రభాస్ స్వీటీ ఫామిలీ ని కలిసిన ఫోటోలు బయటకి వచ్చాయి.

అనుష్క భాగమతి తరువాత ఏ ప్రాజెక్ట్ కూడా ఓ.కె చెయ్యలేదు,ఈ లోగ వీళ్ళ రిలేషన్ షిప్ నిజమే అంటూ ఉమయిర్ సందు వేసిన ట్వీట్…..అంతే మళ్ళీ వీళ్ళ పెళ్లి టాపిక్ షురూ అయ్యింది.పైగా ప్రభాస్ బర్త్ డే కి అనుష్క ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఎదో ఉందనే అనుమానాల్ని బలపరుస్తుంది.ఎంత 5 సంవత్సరాల ఫ్రెండ్ షిప్ అయినా కూడా మరీ లక్షలు ఖరీదు చేసే వాచ్ ని స్పెషల్ గా డిజైన్ చేయించి మరీ ఇవ్వాలా? అంటూ కొంతమంది ప్రశ్నలు…ఎందుకంటే బాహుబలి టీమ్ లోని జక్కన్న,రానా,తమన్నా వీళ్లంతా సింపుల్ గా విషెస్ చెప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు కదా. అందుకే ఇప్పడు అనుష్క పంపిన ఈ గిఫ్ట్ రూమర్స్ రూట్స్ ని మళ్ళీ బలంగా నాటుకునేలా చేస్తుంది.ఇప్పటికయినా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే తప్ప వీళ్ళ ప్యూర్ ఫ్రెండ్షిప్ ని అర్ధంచేసునే బ్రాడ్ మైండ్ థాట్ రాదు చాలామంది జనాలకి.