HomeTelugu Big Stories'అవతార్‌-2' మూవీ ట్రైలర్‌

‘అవతార్‌-2’ మూవీ ట్రైలర్‌

Avatar 2 movie Trailer
సినీ ప్రేక్షకులు ఎంతో ఆస్తికిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్‌ 2’. తాజాగా మేకర్స్ అవతార్‌ 2 ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పండోర గ్రహంపై కనుగొన్న కొత్త కుటుంబంతో జేక్ సల్లీ అసోసియేట్‌ అయ్యే సన్నివేశాలతో మొదలైంది ట్రైలర్. జేక్ సల్లీ, అతని ఫ్యామిలీ నీటి అడుగున ఎలా జీవించాలో నేర్చుకోవడం మొదలుపెట్టడం ట్రైలర్‌లో కనిపిస్తుండగా.. మరోవైపు పండోరలో జేక్, అతని ఫ్యామిలీని మట్టుకరిపించేందుకు ముప్పు ముంచుకొస్తుంది. ఆ ముప్పు జేక్‌ సల్లీ టీం తమ కుటుంబాన్ని, భూగోళాన్ని నాశనం చేయకుండా ఎలా అడ్డుకున్నారన్నది సస్పెన్స్ లో పెడుతూ.. కట్ చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అవతార్‌ 2లో కేట్‌ విన్స్‌లెట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ జేమ్స్‌ కామెరాన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై సృష్టించిన ఈ విజువల్‌ వండర్‌ మరోసారి గ్లోబల్ బాక్సాఫీస్‌ ను షేర్ చేసేందుకు రెడీ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu