HomeTelugu Big Stories'భోళా శంకర్‌' ఫస్ట్‌లుక్‌

‘భోళా శంకర్‌’ ఫస్ట్‌లుక్‌

Bhola shankar frist look

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. మోహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం తెలుగు రీమేక్‏ ఇది. చిరంజీవి కెరీర్‏లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మెగా అభిమానులు వెండితెరపై చిరంజీవి ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా ఈ ఫస్ట్‌ లుక్‌ ఉంది. స్టైల్‌గా జీపుపై కూర్చొని ఊర మాస్‌ లుక్‌లో చిరంజీవి అదరగొట్టేశాడు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu