HomeTelugu Big Stories'యాత్ర-2' జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు

‘యాత్ర-2’ జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు

Bollywood actor as a YS Jag

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ బయోపిక్‌తో డైరెక్టర్ మహి వి.రాఘవ్. ఈ సినిమాకి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ‘యాత్ర 2’ కూడా తీస్తానని దర్శకుడు అప్పట్లోనే ప్రకటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కిస్తానని.. వైఎస్ రాజా రెడ్డి – జగన్ గురించి చెప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ పూర్తి కాదని యాత్ర డైరెక్టర్ వెల్లడించారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బియోపిక్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అప్పటి నుంచే అందరిలో ఆసక్తి పెరిగింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారనే అనేది ఆసక్తికరంగా మారింది.కాగా జగన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ తో ప్రతీక్ గాంధీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జగన్ పోలికలకు దగ్గరగా ఉండటంతో పాటుగా హావభావాలు కూడా పలికించగలడని ప్రతీక్ గాంధీ ని రాఘవ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

‘యాత్ర’ సినిమా క్లైమాక్స్ లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో పాటుగా రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించిన విజువల్స్ చూపించి ఎండ్ చేశారు. ‘యాత్ర 2’ చిత్రంలో వైఎస్సార్ మరణం నుంచి మొదలుపెట్టి.. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రతో చారిత్రక విజయం సాధించి సీఎం అయ్యేవరకు జరిగిన పరిణామాలను చూపించనున్నారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu