HomeTelugu Big Stories'బ్రహ్మాస్త్రం' మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

‘బ్రహ్మాస్త్రం’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

BRAHMASTRA OFFICIAL TRAILER
బాలీవుడ్ ప్రేక్షకులు.. ఎంతగానో ఎదురుచూచూస్తున్న చిత్రం.. ‘బ్రహ్మాస్త్ర’. మూడు భారీ నిర్మాణ సంస్థలు కలిసి వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మొదటి భాగాన్ని విడుదలకి రెడీ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ .. అలియా భట్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో అమితాబ్ .. నాగ్ .. మౌనీ రాయ్ కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.

తెలుగులో ఈ సినిమాను ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ వర్క్ ఒక రేంజ్ లో కనిపిస్తోంది. బ్రహ్మాస్త్రంతో ముడిపడిన ఒక యువకుడి కథ ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu